ఏపీ మంత్రి నారాలోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఆయన పర్యటించారు.. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. విజన్‌కు ప్రిజన్‌కు తేడా తెలియని వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనని అన్నారు.
ఆయన చూపు ఎప్పుడూ జైలు వైపే ఉంటుందని విమర్శలు చేశారు. అభివృద్ధికి అడ్డుపడితే రెడ్ బుక్‌లో పేరు చేరుస్తామని మంత్రి హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే ఒకరికి గుండె పోటు.. ఇంకొకరికి చెయ్యి విరిగింది అని.. మాజీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి నారాలోకేశ్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.