మన’లోకం’ ఇన్ సైడ్ స్టోరీ :  బాబు లాగా చేయకూడదు అనుకుంటూ .. ఊబిలో మునుగుతున్న జగన్ ?

-

పరిపాలన విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో చంద్రబాబు మాదిరిగా ఉండకూడదు అని జగన్ ముందు నుండి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా తీసుకున్న నిర్ణయం ప్రజలకు మంచి చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం చంద్రబాబు లాగా చేయకూడదు అనుకుంటూ…జగన్ ఊబిలో కూరుకుపోతున్నారు అన్ని రాజకీయ మేధావులు అంటున్నారు. అదేమిటంటే మీడియా కి జగన్ కి మధ్య ఉన్న బంధం. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి చాలా విషయాలు మీడియా పాత్ర ఎక్కువ ఉండేది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చిన తీరు కి సంబంధం లేకుండా చంద్రబాబు టైంలో మీడియా తెగ ఊదరగొట్టేది. అవే నిర్ణయాలు ప్రజల జీవితాల్లోకి వచ్చేసరికి పెద్దగా ఏమీ కనిపించేది కాదు.అయితే ఇక్కడ జగన్ మాత్రం తన నిర్ణయాలను మీడియాకి చెప్పటంలేదు..అసలు గవర్నమెంట్ ప్రజలకు ఏం చేస్తుంది అన్న దాని విషయంలో మీడియాతో సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వడం లేదు. దీంతో చాలా వరకు జగన్ తీసుకున్న మంచి నిర్ణయాలు ప్రజలలోకి వెళ్ళటం లేదు. ఇదే టైం లో దీన్ని అవకాశంగా తీసుకుని జగన్ కి వ్యతిరేకంగా ఉండే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని చాల బూచిగా చిత్రీకరిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్ తన నిర్ణయాలను మీడియాకి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేస్తున్నారని  మేధావులు అంటున్నారు.

 

ప్రభుత్వ నిర్ణయం ఉన్నది ఉన్నట్టుగా మీడియాకి చెప్పితే…ఎల్లో మీడియా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుందని ప్రజల్లోకి అది బలంగా వెళుతుందని..కాబట్టి వైయస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకి అనుసంధానం చేస్తూ ప్రజలకు చేరవేయాలి అని కోరుచున్నారు. అలా అని చంద్రబాబు లాగా ప్రచారం మీదే దృష్టి పెట్టకుండా యధావిధిగా పని చేసుకోవాలి అని, కనీస ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ నిర్ణయాలు మీడియాకి చెప్పాలని అంటున్నారు. ఇలా చెప్పకపోతే రాజకీయంగానే జగన్ ఊబిలో కూరుకుపోయినట్లే అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే మీడియాని జగన్ సరిగ్గా డీల్ చేసుకోవాలని లేకపోతే భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version