కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు, వ్యతిరేకత, నిరసనలు ప్రజలలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎన్పీఆర్, సిఏఏ ఇలాంటి బిల్లులకు తీవ్రంగా మైనార్టీల లో ఆందోళన నెలకొంది. ఇటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కేవలం దేశ భద్రత కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెబుతున్నా కానీ ముస్లిం మైనార్టీలు ఏ మాత్రం మీ పిల్లలకు సపోర్ట్ చేయడం లేదు.
ఈ సభలో వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా, ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలు పాల్గొన్నారు. సిఏఏ కు వ్యతిరేకంగా వైకాపా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని, వీటిని ఏపీలో అమలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం వైకాపా నేతలు ఈ విషయంలో వైఎస్ జగన్ పై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పడంతో పాటు ఒకవేళ జగన్ అనుకూలంగా వ్యవహరిస్తే ప్రజల కోసం తమ పదవులకు రాజీనామా చేస్తామని వైకాపా మైనార్టీ నేతలు ఈ సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రం తో చాలా క్లోజ్ గా ఉంటున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చాలా నిర్ణయాలు తీసుకుంటూ దేశంలోనే మాదిరికరమైన నాయకుడిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో…సిఏఏ, ఎన్పీఆర్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు మోడీతో దేశ ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఈ రెండు చట్టాల వల్ల దేశానికి ప్రమాదం లేదని చెప్పించే బాధ్యత జగన్ తీసుకుంటే కచ్చితంగా దేశం మొత్తం చెయ్యెత్తి జై కొడుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.