2019 సార్వత్రిక ఎన్నికలలో అత్యంత భారీ మెజార్టీతో ప్రజల అభిమానులను అందుకున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే కొన్ని విషయాలలో చాలా మొండితనం గా వ్యవహరించడంతో పాటు మీడియాకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో జగన్ మైలేజ్ రోజు రోజుకి తగ్గిపోతున్నట్లు ఇటీవల వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సందర్భంలో కరోనా వైరస్ వ్యాధిని చాలా తేలిగ్గా తీసుకున్నట్లు సీఎం జగన్ కామెంట్ చేయడంతో ఆయన పై సోషల్ మీడియాలో సెటైర్లు భారీ స్థాయిలో పడ్డాయి.
ఈ విధంగానే వైయస్ జగన్ మీడియాతో కాంటాక్ట్ అవుతూ ముందుకు వెళితే బాగుంటుందని, మైలేజ్ కోల్పోయే అవకాశం ఉండదని, ఈ వైరస్ రాష్ట్రంలో ఎక్కువ స్ప్రెడ్ అయితే…మీడియా జగన్ ని ఓ ఆట ఆటాడుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.