ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గర్భిణీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ తరహా ప్రసవం జరిగి నా తల్లికి 5000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైద్య మరియు ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా అలాగే ఆరోగ్యశ్రీ కార్యక్రమాలపై కీలక ఆదేశాలు చేశారు.
ఆరోగ్య ఆసరా పథకం కింద సహజ ప్రసవం జరిగిన అలాగే సిజేరియన్ జరిగినా ప్రతి తల్లికి 5000 రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచనలు చేశారు.
సహజ ప్రసవం పై అవగాహన అలాగే చైతన్య నింపాల్సిన బాధ్యత వైద్యుల దేనని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు అధికారులు వివరించారు. ఆరోగ్యశ్రీలో 25 వందల ప్రొసీజర్ లు అవుతున్నాయని అధికారులు వివరించారు.