భార్యతో కలిసి క్యూట్ ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. వెకేషన్ లో..!!

-

ఉపాసన – రామ్ చరణ్.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట జూన్ 14వ తేదీ నాటికి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే వీరిరువురి వెడ్డింగ్ డే కి సంబంధించి ఒక గ్రాండ్ గా పార్టీని ఏర్పాటు చేసి అతిధులకు ఆతిథ్యం ఇవ్వడానికి మెగా ఫ్యామిలీ ఇప్పటికే సన్నాహాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరో వైపు రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా విజయం తరువాత తన భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి టూర్ వెళ్లారు.

గత కొన్ని రోజుల క్రితం తన భార్య ఉపాసనతో కలిసి ఇటలీ కి టూర్ కి వెళ్ళిన చెర్రీ..అక్కడ వీరిద్దరు గడిపే ప్రతి క్షణం ఇంస్టాగ్రామ్ వేదికగా రామ్ చరణ్ షేర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కలుగ జేస్తారు. ఇక ఈ క్రమం లోనే రామ్ చరణ్ తన భార్య ఉపాసన కూడా.. చుట్టూ చెట్ల మధ్య గార్డెన్లో ఇద్దరూ తెల్లటి వర్ణం కలిగిన దుస్తులను ధరించి.. ఒకరికొకరు ఆప్యాయంగా చూసుకుంటున్న ఒక ఫోటోను అలాగే క్యూట్ ఏమోజీ ని రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో చూపరులను బాగా ఆకట్టుకుంటోంది ఈ ఫోటో. ఇకపోతే రామ్ చరణ్ షేర్ చేసిన ఈ ఫోటోని చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అవుతూ క్యూట్ ఫోటో అంటూ కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఇక పోతే ఈ జంటకు అడ్వాన్స్ మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఇక 2012 జూన్ 14వ తేదీన ఒకటైన ఈ జంట రేపటితో పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version