గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో జనసేనకు వచ్చిన సీటు ఒకటి.. అది తూర్పుగోదావరి జిల్లా రాజోలు. ఆ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కూడా వైసీపీకి దగ్గరయ్యారు. ఇక పార్టీ అధ్యక్షుడి హోదాలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ భీమవరం, గాజువాక రెండు చోట్లా ఓడిపోయాడు. పవన్‌పై రెండు చోట్లా కూడా వైసీపీయే గెలిచింది. వీరిలో భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. వీరిద్దరు పవన్‌ను ఓడించి జెయింట్ కిల్లర్లుగా నిలిచారు. వీరిద్దరికి అప్పుడే పదవులు వస్తాయని అందరూ అనుకున్నారు. వీరిద్దరికి అప్పుడు జగన్ పదవులు ఇవ్వలేదు.
ఇక పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర కావొస్తోంది. గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి వస్తుందనుకున్నా రాలేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఫైర్‌బ్రాండ్లకు జగన్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తోంది. గాజువాకలో నాగిరెడ్డిని గెలిపించేందుకు నాడు జగన్ రీల్ హీరోకు, రియల్ హీరోకు జరుగుతోన్న ఫైట్. నాగిరెడ్డిని గెలిపిస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇప్పుడు ఆయన్ను ఈబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా జగన్ నియమిస్తున్నట్లుగా సమాచారం. ఈ పదవి రాష్ట్రస్థాయిలో ఉండడంతో నాగిరెడ్డి రాజకీయ ఎదుగుదలకు ఇది చాలా ప్లస్ అనే చెప్పాలి.
ఇక భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనుకు ఇప్పట్లో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మరో యేడాది తర్వాత జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఖచ్చితంగా మంత్రి పదవే ఇవ్వనున్నారట. కేబినెట్ ఏర్పాటు అయినప్పుడే కాపు కోటాలో శ్రీనుకు మంత్రి పదవి రావాలి. అయితే జగన్ అదే జిల్లాలో మరో కాపు నేత ఆళ్ల నానికి మంత్రి పదవి ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో యేడాదిలో జరిగే ప్రక్షాళనలో కాపు కోటా + పవన్‌ను ఓడించిన కోటాలో శ్రీనును కేబినెట్లోకి తీసుకోవడం ఖాయమైందట.
ఇక గ్రంధి శ్రీను కూడా జగన్‌కు నమ్మినబంటే. ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏదేమైనా పవన్‌ను ఓడించిన ఈ ఇద్దరు ఫైర్‌బ్రాండ్లకు జగన్ అదిరే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరికి రాజకీయంగా మరో మెట్టు ఎక్కేందుకు ఇది మంచి ఛాన్సే అనుకోవాలి.
-vuyyuru subhash