దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఊహించని దానికన్నా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా 400 పాజిటివ్ కేసులు పెరిగాయి. నిజానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించినా.. ఉదయం ఆరు నుంచి మద్యాహ్నం 1 గంట వరకు గ్రామాల్లో ఉదయం 9 వరకు నగరాల్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఫలితంగా ప్రజలు బయటకు వస్తున్నారు. వారి దైనందిన కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇలా బయటకు వచ్చిన వారివల్ల ఇబ్బంది లేదని అనుకున్నా.. ఇప్పుడు రా ష్ట్రంలో పరిస్థితి చేయి దాటే ప్రమాదం పొంచి ఉందనేది నిపుణుల మాట. అంతేకాదు, తెలంగాణ ఉదంతం కూడా ఇదే పరిస్థితిని కళ్లకు కడుతోంది.
అక్కడ 20 కేసులు నమోదు అయ్యే వరకు ప్రబుత్వం సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత కనిపిస్తే చాల్చేయమంటారా? అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహించారు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదని అనుకుంటే.. ముందస్తు జాగ్రత్తలుగా సీఎం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. వీటివల్ల ప్రజలకు, ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా గ్రహించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఒకటి కీలకమైన అంశం. ఇప్పటికే విదేశాలు లేదా ఇతర రాష్ట్రాల నుం చి వస్తున్నవారికి క్వారంటైన్ నిర్బంధం అమలు చేస్తున్నారు.
మంచిదే. అయితే, రాష్ట్రంలో ఇప్పటికే కరోనా బాధిత జిల్లాలుగా ఉన్న జిల్లాల సరిహద్దులను పూర్తిగా మూసేయాలి. ఆ ఏరియాల నుంచి పురుగును కూడా బయటకురాకుండా చూడాలి. లేదంటే.. వ్యాప్తి మరింత పెరిగి.. ఇప్పుడు ఎలాంటి కేసులు లేని మిగిలిన 2 జిల్లాలలోనూ పరిస్థితి చేయిదాటే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సడలించిన కర్ఫ్యూ సమయా న్ని ఓ గంట కుదించాలి. అంతేకాదు, ఈ విష యంలో మరో కీలక నిర్ణయం తీసుకోవాలి. అది ఒకింత ఇబ్బంది కలిగించినా అమలు చేయక తప్పదు. అదే.. రోజు విడిచి రోజు మాత్రమే ఈ విధానం అమలు చేయాలి.
దీనివల్ల ఆదిలో కొన్ని ఇబ్బందులు వచ్చినా.. ప్రభుత్వం.. ప్రజలు కూడా హైరానా పడకుండా వైరస్‌ను పూర్తిగా నియంత్రించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు పంచుతామని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించే జాగ్రత్తలతో కరపత్రాలు కూడా పంచితే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి సీఎం దీనిపై కూడా దృష్టి పెట్టాలి.