అనిల్ కుమార్ యాదవ్ మీద కాస్తంత గుస్సాగా ఉన్న వై ఎస్ జగన్ ?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమ్మినబంటు లలో ఒకరు అనిల్ కుమార్ యాదవ్. కీలక సమయంలో వైసీపీ పార్టీలో అనేక విషయాలలో వైయస్ జగన్ కి అండగా ఉంటూ నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ బలంగా ఉండటానికి ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కీలకమైన జలవనరుల శాఖని అనిల్ కుమార్ యాదవ్ కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి అతికీలకమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో అన్నీ దగ్గరుండి చూసుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ కి తన పరిపాలనలో విశిష్టమైన స్థానాన్ని కల్పించారు జగన్.ఇదే స్థాయిలో కర్నూలు జిల్లాకి ఇన్చార్జిగా కూడా నియమించడం జరిగింది. ఇటువంటి తరుణంలో కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మార్కెటింగ్ కమిటీల నియామకం అనిల్ కుమార్ యాదవ్ చేసిన పనికి వైయస్ జగన్ ….అనిల్ మీద కాస్తంత గుస్సాగా ఉన్నట్లు వైసీపీ పార్టీలో టాక్. విషయంలోకి వెళితే అనిల్ కుమార్ యాదవ్ ఇన్చార్జిగా ఉన్న కర్నూలు జల్లాలోని నంది కొట్కూరు నియోజకవర్గంలో మార్కెటింగ్ కమిటీల నియామకంలో అనిల్ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారట.

 

నియోజకవర్గ ఇంచార్జి సిద్ధార్థ్ రెడ్డికి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఎస్సీ ఎమ్మెల్యే అయిన ఆర్థర్ ని తక్కువ చేసి చూస్తున్నారనేది కంప్లయింట్. ఎమ్మెల్యే ఆర్థర్ అనుచరులు ఈ విషయంలో అనిల్ ని కాస్త గట్టిగానే హెచ్చరించారు. మా నియోజకవర్గంలో తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో దళితుల విషయం కాబట్టి ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారట జగన్. ముందు నుండి వైసీపీ పార్టీకి అండగా నిలబడింది దళితుల అయిన నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ ఈ విధంగా వ్యవహరించడంతో అనిల్ ని జగన్ పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. దీంతో ఈ వార్త ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version