రాజధాని విషయంలో జగన్ వ్యూహం అదేనా…?

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరిస్తున్న విధానంపై ఇప్పటికే రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సహా కొన్ని పక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. రాజకీయ స్వలాభం కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు ఎక్కువగా ఇతర పక్షాల నుంచి వినపడుతున్నాయి. తన నిర్ణయం మీద కట్టుబడే స్వభావం ఉన్న జగన్… అనూహ్యంగా ఉండొచ్చు అనే మాట ద్వారా… రాజధాని విషయంలో అనేక ప్రశ్నలను ఆయన లేవనెత్తారు…

వారం రోజుల్లో… రాజధానిపై కమిటి నివేదిక వస్తుంది అంటూనే… సౌత్ ఆఫ్రికా మోడల్ లా ఉండొచ్చు అని జగన్ వ్యాఖ్యానించడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి… అమరావతిలో తెలుగుదేశం నేతలకు భూములు ఉన్నాయని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించినా సరే ఇప్పటి వరకు దాన్ని ప్రభుత్వం బయటపెట్టలేదు. దీనికి తోడు కేంద్రం కూడా… అమరావతిని గుర్తించింది. జగన్ వారం రోజులు అనే ప్రకటన చేయడం ద్వారా… ఈ వారం రోజుల్లో ప్రజల అభిప్రాయం ఏంటీ…? మెజారిటి ప్రజలు ఎం కోరుకుంటున్నారు అనే విషయాన్ని జగన్,

ఆయన మంత్రి వర్గం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. రాజధాని విషయంలో జగన్ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేది వాస్తవం. దీనితోనే మూడు రాజదానులపై ప్రకటన చేసారు. ఇక ఆ ప్రకటన చేసిన రోజు సాయంత్రం ఆయన మంత్రులు, కీలక అధికారులతో డిన్నర్ కూడా ఏర్పాటు చేసారు… ఇందులో వాళ్ళ అభిప్రాయం కూడా జగన్ తెలుసుకునే ప్రయత్నం చేసారు. అమరావతి ప్రాధాన్యత తగ్గించే క్రమంలో భాగంగా జగన్ రాజధాని విషయంలో అలా వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. వికేంద్రీకరణ అనేది జరిగితే మాత్రం… అమరావతి ప్రాధాన్యత తగ్గడంతో పాటు… తనకు రాజకీయంగా కలిసి వస్తుంది అనే భావనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే కొత్తగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ను ఆయన సీన్ లోకి తీసుకొచ్చారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version