నీ శీలం ఎన్ని సార్లు దోచుకున్నారు జగ్గారెడ్డి..? – వైఎస్ షర్మిల

-

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మరోసారి షర్మిల స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్సాఆర్‌.. నీ శీలం కరాబు చేశాడా.. ఎన్ని సార్లు.. నీ శీలం తీశాడు అంటూ ప్రశ్నించారు షర్మిల. కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది వైయస్ఆర్. కేంద్రంలో అధికారంలోకి తెచ్చేలా చేసింది వైయస్ఆర్. అలాంటి మహానేత మరణించగానే.. ఆయన పేరును ఎఫ్ ఐఆర్ లో చేర్చి వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

వైఎస్సార్ గెలిచిన పార్టీ.. కాంగ్రెస్ లో కలిసి పోయిందని.. ఆ మాత్రం జ్ఞానం లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్ కి పట్టలేదన్నారు. నీలా పార్టీలు మారి రాజకీయ వ్యపిచారం చేసే సంస్కృతి వైఎస్ఆర్ ది కాదన్నారు. పొద్దున టిఆర్ఎస్,మధ్యాహ్నం బీజేపీ,సాయంత్రం కాంగ్రెస్..ఎవడు పిలిస్తే అక్కడికి పోతావని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

KTR కోవర్టు జగ్గారెడ్డి, మతి తప్పి మాట్లాడుతున్నాడు.YSR పార్టీ మారాడట. ఎప్పుడు మారాడయ్యా? రోజుకో పార్టీ నువ్వు మారి పిచ్చిఎక్కి మాట్లాడుతున్నావా? నీ నియోజకవర్గం కోసం ఏనాడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించావా?జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version