ఏపీలో తల్లికి వందనం పథకం పైన అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయనేలేదు. ఇలాంటి తరుణంలో తల్లికి వందనం విధివిధానాలుపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తల్లికి వందనం పథకంపై విధివిధానాలు ప్రకటిస్తామని శాసన మండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
తల్లికి వందనం పథకానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందన్నారు. కాగా తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఇక డీఎస్సీ పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్.