కాగా వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్సార్‌టీపీగా పార్టీ పేరు ఖరారు చేశారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కూడా ఆమోదించాయి. జులైలో పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఇటీవల కాలంలో ఆమె పరామర్శించారు
ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..? (1/2) pic.twitter.com/5xHFvfnbe5
— YS Sharmila (@realyssharmila) June 6, 2021