ఇంటి ముందుకు వచ్చి కాకి అరిస్తే మంచిదేనా..?

-

కాకులకు మనకు ఏదో తెలియని సంబంధం ఉంటుంది.. కాకులను పితృదేవతలకు ప్రతినిధిగా హిందువులు భావిస్తారు. మ‌న దేశంలో ఇత‌ర ప‌క్షుల కంటే కాకికి, దాని అరుపుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. క‌ర్మ‌లు చేసేట‌ప్పుడు కాకి వ‌చ్చి మ‌నం పెట్టిన పిండాల‌ను తింటేనే చ‌నిపోయిన వారి ఆత్మ‌కు శాంతి క‌లుగుతుందని మ‌నలో చాలా మంది గాఢంగా న‌మ్ముతారు. ఈ మధ్యనే వచ్చిన బలగం సినిమా చూసే ఉంటారు. అందులో పిట్టముట్టలేదని కథ అంతా నడుస్తుంది. పిండం కాకితినకపోతే.. ఆ కుటుంబం ఎం బాధపడుతుంది, దామివల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది చెప్పేందుకు చిన్నవిషయంగా ఉన్నా.. ఎంత పెద్ద మ్యాటరో చాలా బాగా చూపించారు.. మ‌న పూర్వీకులు కాకుల రూపంలో మ‌న ఇంటి చుట్టూ తిరుగుతార‌నే విశ్వాసం కూడా ఉంది. వివిధ సంద‌ర్భాల‌లో కాకి ప్రవ‌ర్తించే తీరును బ‌ట్టి శుభ‌, అశుభ శ‌కునాలు ఉంటాయ‌ని మ‌న పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఆ శకునాల గురించి, వాటి వ‌ల్ల క‌లిగే ఫ‌లితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా అయితే అశుభం..

మ‌న ఇంటి మీద లేదా ఇంటి ముందు కాకి అరిస్తే మ‌న ఇంటికి బంధువులు వ‌స్తార‌ని న‌మ్ముతారు. ఇంటి ముందు ఒక కాకి కాకుండా నాలుగైదు కాకులు అరుస్తూ ఉంటే ఏదో కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని సంకేతం. కాకి గ‌న‌క ఎగురుతూ వ‌చ్చి మ‌న త‌ల‌పై వాలితే ఏదో చెడు జ‌ర‌గ‌బోతోంద‌ని, ప్రాణ భ‌యం కూడా ఉంటుంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు.కాకి మీద వాలిన వెంటనే త‌ల‌స్నానం చేసి ఏమీ కాకూడ‌ద‌ని ఇష్ట దైవాన్ని ప్రార్థించాల‌ట.

ఇలా జరిగితే శుభం..

అలాగే మ‌నం బ‌య‌ట‌కు వెళ్లున‌ప్పుడు కాకి కుడి వైపు నుండి ఎడ‌మ వైపుకు వ‌స్తే ఆ ప‌ని దిగ్విజ‌యంగా జ‌రుగుతుంది. ఒక‌వేళ కాకి గ‌న‌క ఎడ‌మ వైపు నుండి కుడి వైపుకు వ‌స్తే అశుభం క‌లుగుతుంది. ఇలా క‌నుక జ‌రిగితే వెంట‌నే ఇంట్లోకి వ‌చ్చి కాళ్లు క‌డుక్కుని కొద్ది సేపు కూర్చొని మ‌ర‌లా బ‌య‌ట‌కు వెళ్లాల‌ని శ‌కున శాస్త్రం చెబుతోంది. శుకన శాస్త్రంలో ఇలాంటి వాటి గురించి క్లియర్‌గా ఉంది. మీకు ఆసక్తి ఉంటే తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version