వైఎస్సార్ కి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది నేను పబ్లిక్ గా చెప్తున్న : వైఎస్‌ షర్మిల

-

తెలంగాణలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆమె మెదక్ లోని నర్సాపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ కాదు వైఎస్సార్ నా తండ్రి అని అన్నారు. వైఎస్సార్ కి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది నేను పబ్లిక్ గా చెప్తున్నానని, 30 ఏళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ కి సేవ చేశాడన్నారు. 2004లో 2009 లో రెండు సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారన్నారు. వైఎస్సార్ చేసిన పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో వైఎస్సార్ కీలకమన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ చనిపోతే దోషి అని FIR లో నమోదు చేసిందని, ఇది వైఎస్సార్ కి వెన్నుపోటు పొడిచినట్లు కాదా రాజశేఖర్ రెడ్డి గారిని మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. కనీసం హెలికాప్టర్ లో చనిపోతే ఎలా చనిపోయాడు అని దర్యాప్తు కూడా చేయించలేదని, అసలు పట్టించుకోలేదు అంత గొప్పనాయకుడు అని కృతజ్ఞత కూడా లేదని, బ్రతికి ఉన్నప్పుడు ఇంద్రుడు – చంద్రుడు అని పొగిడారన్నారు.

చనిపోయాక పోగడక పోయినా పర్వాలేదు..కానీ FIR నమోదు చేసి అవమాన పరిచారని, కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉండాలని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్సార్ ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతుందా? అని, వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని, ఇప్పుడు వైఎస్సార్ బ్రతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మి వేసేవాడన్నారు. కాంగ్రెస్ పార్టీ కి వైఎస్సార్ ఖ్యాతిని తెచ్చారు…వైఎస్సార్ కి కాంగ్రెస్ ఖ్యాతిని తేలేదని, వైఎస్సార్ చనిపోయాక కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారంలో ఉందని, వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదన్నారు. నాయకుడు అంటే వైఎస్సార్ లా ఉండాలని నిరూపించాడని ఆమె వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version