OMG..ఇతను అతనేనా..రష్యా చెరలోంచి బయటపడ్డ ఉక్రెయిన్‌ సైనికుడి దీనస్థితి…

-

రష్యా- ఉక్రెయిన్‌ దాడి వల్ల ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఉక్రెయిన్‌లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం సామాజిక మాధ్యామాలలో చూస్తూనే ఉన్నాం. ఉద్యోగాలు లేక రోడ్డుమీద పావుబాజీలు అమ్ముకున్న రిపోర్టర్లు ఉన్నారు. ఏడు నెలలు గడిచినా యుద్ధం కొనసాగుతుండడంతో.. ఎన్నో దయనీయ దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నామధ్య ఒక రిపోర్టర్‌ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇప్పుడు అంతకు మించి హృదయ విదారకమైన ఫోటో నెటిజన్లను కంటతడిపెట్టిస్తుంది. రష్యా హింసకు ఇది నిలువెత్తు నిదర్శనంగా ఉంది.

రష్యా చెర నుంచి విడుదలైన ఉక్రెయిన్ సైనికుల దుస్థితిని ఆ దేశం వెల్లడించింది. తీవ్ర గాయాలపాలై, అనారోగ్యంతో కుంగిపోయినప్పటికీ, రష్యా నుంచి బతికిబయట పడ్డాడంటూ మైఖైలో దియనోవ్‌ అనే సైనికుడి చిత్రాలను షేర్ చేసింది. అతడి మునుపటి, ప్రస్తుత చిత్రాలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంత దారుణంగా రష్యా ప్రవర్తించిందా అన్నట్లు ఉంది.

రష్యా ఈ విధంగా జెనీవా ఒప్పందాలను కాలరాస్తోంది. ఈ విధంగా నాజీల వారసత్వాన్ని కొనసాగిస్తోంది అని రష్యాపై ఉక్రెయిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకునే క్రమంలో దియనోవ్‌ రష్యా సైనికులకు చిక్కాడు. కాగా, గత బుధవారం విడుదలైన 205 మంది సైనికుల్లో ఇతను కూడా ఉన్నాడు..దియనోవ్‌కు సంబంధించి తాజా చిత్రంలో.. అతడు చాలా బలహీనంగా కనిపించాడు…

ముఖం, చేతులపై గాయాల తాలుకూ గుర్తులు ఇంకా ఉన్నాయి… ప్రస్తుతం కీవ్‌ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అతడి సోదరి అలోనా తెలిపింది..రష్యా చెరలో అమానవీయ పరిస్థితుల కారణంగా చేతిలో కొంత ఎముకను కోల్పోయాడని వైద్యులు చెప్పారు. తన సోదరుడు బరువు పెరిగే వరకు వైద్యులు పూర్తిస్థాయిలో చికిత్స అందించే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా, మానసికంగా బలంగా ఉన్నాడని సోదరి తెలిపింది.

బయటపడిన వారి పరిస్థితి ఇలా ఉంటే.. ఇంకా రష్యా చెరలో ఇరుక్కున్న వారిని ఎవరు కాపాడుతారో.. ఉక్రెయిన్‌లో ఎంతోమంది ఈ యుద్దం వల్ల అయినవాళ్లను కోల్పోయారు. ఈ దెబ్బ నుంచి కోల్పోవడానికి ఉక్రెయిన్‌కు కొన్ని ఏళ్లు పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version