నిజామాబాద్ గాంధీ చౌక్ వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. అయితే.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సభలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితుల కోసం 500 కోట్ల నిధులు అన్నారు.. NRI సెల్ అన్నారు..ఏమయ్యింది..? నిజామాబాద్ పట్టణానికి ప్రతి ఏడాది 100 కోట్లు అన్నారు…ఎన్ని ఇచ్చారూ..? ఎంపీ అరవింద్ చేసింది జిల్లాకు ఏం చేశారు..? బాండ్ పేపర్ రాసి ఇచ్చి రైతులకు మోసమే చేశాడు. నమ్మి ఓటేస్తే తెచ్చిండా పసుపు బోర్డ్. మళ్ళీ మోసమే చేశాడు కదా. టీఆర్‌ఎస్ అయినా…బీజేపీ అయినా అందరూ మోసగాళ్లు. బీజేపీ కోటలు బద్దలు కొడతాం… మెడలు వంచుత అని చెప్పిన కేసీఅర్..వారి కాళ్ళ వెళ్ళ మీద పడ్డారట. ఇక ఒక్క మునుగోడు ఎన్నికలకు మొత్తం ఎమ్మెల్యే లు అంతా దిగిపోయారు. నియోజక వర్గంలో సమస్యలు వస్తే పట్టింపు లేదు.
కానీ ఓట్లు కొనుక్కొనేందుకు వెళ్ళారు. కేసీఅర్ కొడుకు కెటిఆర్ ఇప్పుడు మునుగోడు ను దత్తత తీసుకుంటారట. ఇంతకు ముందు మీకు మునుగోడు కనిపించడం లేదా. మునుగోడు ఏమైనా పాకిస్థాన్ లో ఉందా. మునుగోడు ఏమైనా ఆఫ్గన్ లో ఉందా…లేక పక్కా రాష్ట్రంలో ఉందా.. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తె మీకు గుర్తుకు వచ్చిందా. అధికార పార్టీ కొత్తగా దత్తత తీసుకోవడం ఎంటి. ఇంతకు ముందు మీకు అభివృద్ధి చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు. ఇప్పుడు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. మీరు అధికారంలో ఉన్నారు..మునుగోడు అభివృద్ధి చేయాలని అనిపించలేదా. ఇప్పుడు బై ఎలక్షన్ లో ఓట్లు వేయాలి కాబట్టి దత్తత తీసుకుంటారట. దత్తత తీసుకుంటే నే అభివృద్ధి జరుగుతుందా’ అని ఆమె వ్యాఖ్యానించారు.