వైయస్ బిడ్డకు ఓటు వేస్తారా… ఒక హంతకుడు వేస్తారా ? అంటూ ప్రశ్నించారు వైయస్ షర్మిల. మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం. పులివెందుల ప్రజలారా.. మాకు న్యాయం చేయండని వెల్లడించారు. కడప లో షర్మిల మాట్లాడుతూ జగన్ అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. అన్న కోసం ఇళ్ళు వాకిలి వదిలేసి తిరిగా. జగన్ అన్న సీఎం అయితే వైఎస్ఆర్ సంక్షేమ పాలన వస్తుందనుకున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు.
జగన్ అన్న ఏది చెప్తే అది చేశా. వివేకా హత్య విషయంలో సునీత, చిన్నమ్మ బాగా నష్టపోయారు. వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న. రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలా. సొంత రక్త సంబంధానికి న్యాయం చేయకపోతే మనం ఎందుకు? అని నిలదీశారు. 5ఏళ్లు హంతకులను కాపాడారు. మళ్లీ వారికే సీటు ఇచ్చారు.హంతకుడు చట్టసభల్లోకి వెళ్లొద్దనే కడప నుంచి పోటీ చేస్తున్నా.. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. మాకు న్యాయం చేయండని కోరారు.