రైతుల పాలిట YSR వరం అయితే KCR శాపం అని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. వైయస్ఆర్ హయాంలో పూర్తి స్థాయిలో పంట నష్ట పరిహారం అని పేర్కొన్నారు. పెట్టుబడి కంటే అదనంగా రైతులకు పరిహారం అందజేశారని.. పరిహారంతో పాటు రైతులకు పంట బీమా అమలు చేసినట్లు తెలిపారు వైఎస్ షర్మిల.
సీఎం కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో ఎనిమిదేండ్లుగా పరిహారం లేదని నిప్పులు చెరిగారు. పంట బీమాను సైతం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు షర్మిల. రూ.10వేల సాయం ఏ మూలకు సరిపోతుంది? పెట్టుబడి కంటే తక్కువగా పరిహారం ఇస్తామనడం సిగ్గుచేటు అన్నారు షర్మిల.
నిరుద్యోగులకు KCR చేసింది మోసం కాదు, ద్రోహం కూడా. రెండోసారీ ఉద్యోగాల భర్తీలో KCR మోసమే చేశారు. పేపర్ లీకేజీలపై వెంటనే CBI విచారణ జరిపించాలి. బిస్వాల్ కమిటీ చెప్పిన 1.91లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి. కొత్త జిల్లాల వారీగానూ ఖాళీలు నింపాలి. నిరుద్యోగులకు YSRTP అండగా ఉంటుందన్నారు షర్మిల.