రాహుల్ పై అనర్హత వేటు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ పార్టీ నేత, తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దీనితో మోడీ అసలు స్వరూపం బట్టబయలు అని.. దేశంలో చీకటి రోజులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.
అణిచివేత మోడీ సర్కార్ ఎంచుకున్న మార్గమని.. ఎనిమిదేళ్లుగా బిజెపి ప్రభుత్వం చేస్తున్న తంతు అదే అని ఫైర్ అయ్యారు. ప్రతి పక్షాలను అణిచివేతకే ఈ డి,ఐ టి,సి బి ఐ ల వినియోగం అని.. బిజెపి దుర్మార్గాలకు ప్రజలు చరమ గీతం పాడుతారని హెచ్చరించారు మంత్రి జగదీష్ రెడ్డి.
అటు ఎంపీ గారి రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం పై స్పందించారు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్. పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. మోడీ, బీజేపీ నియంతల పోకడలను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు మధుయాష్కి గౌడ్. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు అనేది కాంగ్రెస్, రాహుల్ గాంధి వ్యక్తిగత సమస్య కాదన్నారు.