త్వరలోనే ముఖ్యమంత్రి అవుతా : వైఎస్ షర్మిల

-

తాను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరి ఉంటే సీఎం అభ్యర్థిగా ప్రకటించే వారిని అంటూ వైఎస్‌ షర్మిల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇతర పార్టీలకు చాకిరి చేసే బదులు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా సొంత పార్టీ పెట్టుకున్నానని తెలిపారు.

అతి త్వరలోనే తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు. బిజెపి పార్టీ మతాన్ని వాడుకున్నట్లుగా కెసిఆర్ సెంటిమెంట్ వాడుకుంటున్నారని విమర్శించారు. తాను పరాయిదాన్ని అయితే కేటీఆర్ భార్య ఏమవుతుందని ప్రశ్నించారు.

ఇక అటు KCR అమరవీరులకు, ఉద్యమకారులకు తీరని ద్రోహం చేశారు. 1200మంది ఆత్మబలిదానం చేసుకుంటే కొంతమందినే గుర్తించారు. నీళ్లు, నిధులు, నియామకాలకు తూట్లు పొడిచి, సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు. కుటుంబానికి, ఉద్యమద్రోహులకు పదవులు కట్టబెట్టి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్ ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version