లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వివిధ రకాల ప్లాన్స్ ని కూడా తీసుకు వచ్చింది. అయితే నిజానికి ఇందులో డబ్బులు పెడితే ఎవరైనా సరే మంచిగా డబ్బులని పొందొచ్చు. అయితే ఎల్‌ఐసీ తీసుకు వచ్చిన పథకాల్లో ‘జీవన్ అక్షయ్’ పాలసీ కూడా ఒకటి. ఇందులో కనుక డబ్బులు పెడితే చక్కటి లాభాలని మనం పొందొచ్చు.
ఇక పూర్తి వివరాలను చూస్తే.. ఈ పాలసీ లో డబ్బులు పెట్టడం వలన అధిక వడ్డీ వస్తుంది. అలానే నిర్ణీత కాలం తర్వాత నెల వారీ లేదా మూడు నెలలు, వార్షిక ఆదాయాన్ని మీరు పొందొచ్చు. సింగిల్ ప్రీమియంగా కనీసం లక్ష రూపాయలు పెట్టాలి. మీరు దీనిలో కనుక ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నెల నెల పెద్ద మొత్తంలో డబ్బులని పొందవచ్చు.
ఇక ఎవరు ఇందులో డబ్బులని పెట్టచ్చు అనేది చూస్తే… 30 నుండి 85 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఎవరైనా సరే దీనిలో డబ్బులు పెట్టచ్చు. మీరు కనుక దీన్ని కొనాలి అంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. కనీస పెట్టుబడి రూ.1 లక్ష. జాయింట్ గా కూడా దీన్ని తీసుకోవచ్చు.
ఒక్కొక్కరుగా రూ.లక్ష పెట్టుబడి పెట్టాలి. ఒకేసారి రూ.9,16,200 జమ చేసినట్లయితే నెలకు రూ.6,859 రాబడి మీకు వస్తుంది. ఏడాదికి మీకు రూ.86,265, ఆరు నెలలకి రూ. 42,008 వస్తాయి. అదే మూడు నెలలకి అయితే రూ.20,745 వస్తాయి. దీనిలో మీరు రూ. 30 లక్షల పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 14,000 పెన్షన్ వస్తుంది. రూ.40 లక్షలు పెట్టుబడి పెడితే అప్పుడు మీకు నెలకు రూ.20,000 పెన్షన్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా మీరు పొందొచ్చు.