షర్మిల సీటు ఫిక్స్..త్రిముఖ పోరులో రిస్క్ ఎక్కువే?

-

దివంగత వైఎస్సార్ తనయురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా కీలక పాత్ర పోషించలేకపోతున్నారనే చెప్పొచ్చు..తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి..వైఎస్ షర్మిల..వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే..అయితే పార్టీ పెట్టిన మొదట్లో తెలంగాణ రాజకీయాలని షర్మిల బాగా ప్రభావితం చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఇంతవరకు ఆమె పార్టీ క్లిక్ అవ్వలేకపోయింది.

అయినా సరే షర్మిల వెనక్కి తగ్గకుండా తెలంగాణలో తిరుగుతూనే ఉన్నారు…ఇప్పటికే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు..అయితే ఆమె పాదయాత్రకు పెద్దగా స్పందన కూడా రావడం లేదు. అయినా ఆమె రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు…నిత్యం రాష్ట్రంలోని సమస్యలని ప్రస్తావిస్తూనే…కేసీఆర్ ప్రభుత్వంపై విమర్సల వర్షం కురిపిస్తున్నారు.

అదేవిధంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చూస్తున్నారు..ఇక ఈ విధంగా రాజకీయం చేస్తూ ముందుకెళుతున్న షర్మిల…వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీటుపై క్లారిటీ వచ్చింది..ఇప్పటికే ఆమె..ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పోటీకి దిగవచ్చని ప్రచారం జరిగింది…నల్గొండలో రెడ్డి వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది…అలాగే అక్కడ వైఎస్సార్ అభిమానులు ఎక్కువ..దీంతో నల్గొండలో ఆమె పోటీ చేయొచ్చని ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఖమ్మం జిల్లాలో పోటీకి దిగుతారని తెలిసింది.. షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారని తెలిసింది. ఖమ్మం జిల్లా వైఎస్సార్టీపీ అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, పాలేరు ఇన్‌చార్జి బీరవెల్లి శ్రీనివాసరెడ్డి..ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మామూలుగా పాలేరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట…అందులోనూ రెడ్డి వర్గం నేతల హవా ఎక్కువగా ఉన్న స్థానం…రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నంతవరకు ఇక్కడ కాంగ్రెస్ కు తిరుగులేదు…ఆయన చనిపోయాక వచ్చిన ఉపఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ తరుపు నుంచి తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు.

ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఉపేందర్ రెడ్డి గెలిచారు…ఆయన మళ్ళీ టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. అయితే నెక్స్ట్ పాలేరు టీఆర్ఎస్ సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు..అటు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్ధిపై క్లారిటీ లేదు. ఇదే సమయంలో షర్మిల అక్కడ నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. అయితే పాలేరులో బీజేపీ బలం తక్కువ…కాబట్టి ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుంది..అయితే షర్మిల బరిలో దిగితే త్రిముఖ పోరు ఉంటుంది…మరి ఈ పోరులో షర్మిల గెలిచి బయటపడతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version