కేసీఆర్ సారూ… సోయిలోకి రా: షర్మిల

-

ట్విట్టర్ లో సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయ్యా పెట్టడు, అడక్కు తిననియ్యడు అంటూ ఆమె ఆరోపించారు. కేసీఆర్ కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చడు అని కేంద్ర అయుష్మా న్ భారత్ లో చేరడు అని మండిపడ్డారు. దొర నిర్ణయాలు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ కి దొచిపెడుతున్నవి అని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ నాలుగు దిక్కులా ఆసుపత్రులు అన్నారు అని ప్రజల ఆరోగ్యానికి సరిపడా బడ్జెట్ ఇచ్చేది లేదు అని మండిపడ్డారు.

ఉస్మానియా,గాంధీ, టీమ్స్,నిమ్స్ , టిమ్స్ లకే ఊపిరి సక్కగా అందుతలేదు అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇక అందులో చేరిన వారికి గాలిలొ దీపం అని ఆవేదన వ్యక్తం చేసారు. కేసీఆర్ సారు సోయిలకు రా…కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చు అంటూ ఆమె కోరారు. ఇక ఆరోగ్య శ్రీలో కరోనా చేర్చే అంశానికి సంబంధించి ఇప్పుడు విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version