కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె.. కాదు బండ : వైఎస్ షర్మిల

-

కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె.. కాదు బండ అని ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రి గా ఉన్నారని… ఆయన సుపరిపాలన ప్రతి గడప ను..ప్రతి గుండెను తాకిందని గుర్తు చేశారు. ఆయన మంచి మనసుతో ఆలోచించి అద్భుతమైన పథకాలు అమలు చేసి చూపించారని… రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్,ఆరోగ్యశ్రీ ,పక్కా ఇళ్లు అన్నారు.

ఇలా ఎన్నో పథకాలు వైఎస్సార్ ను ప్రజలు ఇప్పటి గుర్తు పెట్టుకున్నారని.. 2004, 06,08 లో మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు వైఎస్సార్ ఇచ్చారని.. ఒకే సారి జంబో డీఎస్సీ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలన లో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు.. స్కాలర్ షిప్స్ ఇచ్చే పరిస్తితి కూడా లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

డిగ్రీలు, పిజిలు చదివి కూలి పనికి పోతున్నారు.. ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే తల్లి దండ్రులు అల్లాడి పోతున్నారన్నారు. తలకిందులు తపస్సు చేసినా చనిపోయిన నిరుద్యోగుల ప్రాణాలు తీసుకు రాగలరా…? కనీసం ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శ కూడా లేదని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి అనే వాడికి ఒక అంచనా ఉండాలని.. 8 ఏళ్ల పాలనలో కేసీఆర్ కు ఏం చేత కాలేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version