బుద్ది రావాలనే.. కేటీఆర్ కు ట్వీట్ చేశా : షర్మిలా

-

నల్లగొండ జిల్లాలో నిరాహార దీక్ష చేస్తున్న వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల… మరోసారి టిఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కేటీఆర్ పుట్టినరోజున నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసే బుద్ది ఇవ్వాలనే ట్వీట్ చేశానని షర్మిల పేర్కొన్నారు. అయితే అది.. కేటీఆర్ కు, ఆయన టీమ్ కు నచ్చలేదు…అందుకే తనపై వ్యక్తిగత దాడికి దిగారని మండిపడ్డారు.

పుట్టడం గొప్ప కాదు.. ప్రజలకు సేవ చేయడం గొప్ప అన్నారు. టిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం తప్పితే.. రాష్ట్రమంతా అప్పులపాలు అయిందని.. 4లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపణలు చేశారు. తెలంగాణలో 54 లక్షల మంది యువత నిరుద్యోగులు ఉన్నారని.. ఏడేళ్లలో నాలుగు రెట్లు నిరుద్యోగం పెరిగిందని మండిపడ్డారు. YSR పేదల పక్షపాతి అని.. ఉచిత విద్యుత్ కు ఆద్యుడు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. వై.ఎస్. హయాంలో.. పేదవాడు ఫారిన్ చదువులు, 15నిమిషాల్లో కుయ్ కుయ్ అంటూ 108 అంబులెన్సులు వచ్చాయని తెలిపారు. అలాగే 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని.. మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్, జంబో డిఎస్సీ వేశారన్నారు. 11లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పన చేశారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version