షర్మిల టీమ్‌ అలాంటి నేతల పైనే గురి పెట్టిందా ?

-

తెలంగాణలో పార్టీ ప్రకటన కంటే ముందే.. సన్నాహక సమావేశాలు పెడుతున్నారు వైఎస్ షర్మిల. ఉమ్మడి నల్గొండ..రంగారెడ్డి జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. సమయానుకూలంగా జిల్లాల పర్యటనలు చేయాలని ఆలోచిస్తున్నారు. తమతో కలిసి వచ్చే వారికోసం ఫోన్లు చేస్తున్న షర్మిల అండ్ టీం సెలక్టెడ్ గా కొంత మంది నేతల పైనే గురిపెట్టిందా అన్న చర్చ నడుస్తుంది.

తెలంగాణలోని వైఎస్ అభిమానుల పై ఫోకస్ పెట్టిన షర్మిల టీం వైఎస్ వెంట నడిచిన వారిని సంప్రదించే పనిలో ఉందట. తెలంగాణలో వైఎస్‌ కుటుంబానికి నమ్మకంగా పనిచేసిన వారిలో ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. వీరికి కూడా షర్మిల ఫోన్‌కాల్ చేశారని ప్రచారం జరుగుతోంది. పొంగులేటి పార్టీ మారినా ఏపీ సీఎం జగన్ కి విధేయుడిగానే ఉన్నారు. షర్మిల విషయంలో అలాంటి సానుకూల దృక్పథంతోనే ఉంటారా అన్నది చూడాలి.గతంలో వైసీపీ నుంచే పొంగులేటి ఎంపీగా గెలిచినందున ఆయన్ని టచ్ చేయడంలో తప్పులేదనే భావనలో షర్మిల ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో బలమైన నాయకుల్లో ఒకరిగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ సైతం గతంలో వైఎస్ఆర్ కి సన్నిహితంగా మెలిగిన వారే. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఈ ఇద్దరి మీద చర్చ జరుగుతుంది. కోమటిరెడ్డి సోదరులతో షర్మిల మాట్లాడే ఉంటారని టాక్‌ నడుస్తోంది. గడిచిన కొంత కాలంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో సైలెంట్‌గా ఉంటున్నారు. బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం ఉంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ మీద సైతం సోదరులిద్దరూ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు షర్మిల పార్టీ తెర మీదకు రావడంతో నల్లగొండ బ్రదర్స్‌ చుట్టూ చర్చ మొదలైంది.

తెలంగాణలో షర్మిల రాజకీయం సక్సెస్‌ అయ్యే పరిస్థితి ఉంటుందా.. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం.. ఇప్పుడు మరో నిర్ణయం చేస్తే ఎలా అని సన్నిహితుల దగ్గర కామెంట్‌ చేశారట కోమటిరెడ్డి సోదరులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోటస్‌పాండ్‌ నుంచి వస్తోన్న ఫోన్‌ కాల్స్‌కు కొందరు ఇబ్బందిగానే ఫీలవుతున్నారట. వెంటనే ఏం చెప్పలేకపోతున్నారట. అయినా సరే.. షర్మిల టీం మాత్రం అందరిని టచ్ చేస్తుందనే టాక్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version