వైఎస్ విజయలక్ష్మికి తప్పిన ప్రమాదం

-

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఒంగోలు బయల్దేరిన వెళ్లారు. అయితే.. మార్గమధ్యంలో సంతమాగులూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అదే కారులో ఆమె ఒంగోలుకు చేరుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న తనయుడు జగన్, కూతురు షర్మిల ఆమెకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

ఇదిలా ఉంటే.. కూతురు షర్మిల స్థాపించిన వైఎస్ఆర్‌టీపీ నుంచి విజయమ్మ పోటీ చేయానున్నారని ప్రచారం జరుగుతుంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా రెడీ అయ్యారు.కాని అనుహ్యంగా షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెనకడుగు వేయడంతో.. వైఎస్ఆర్‌టీపీ నుంచి షర్మిల, తల్లి విజయమ్మ పోటీ చేయడానికి సన్నద్దం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనుండగా, విజయమ్మ పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version