వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు : 12 గంటలుగా ఆయుధాల కోసం అధికారుల అన్వేషణ

-

కడప జిల్లా :వివేకా హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటోంది. అయితే.. తాజాగా వివేకా హత్య కు ఉపయోగించిన ఆయుధాల కోసం 12 గంటలుగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. పులివెందుల రోటరీపురం వాగులో మురికి నీరు పూర్తిగా తొలగించి అన్వేషణ సాగిస్తున్నారు పోలీసు అధికారులు. అటు వాగులో ఉన్న వ్యర్థాలను ఇరవై మంది మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నది. అయితే.. ఇది సాధ్య పడకపోవడంతో రంగంలోకి జెసీబీ యంత్రాలు దిగాయి.

జెసీబీ యంత్రాల సహాయంతో వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.. మొదటి రోజు ఎనిమిది గంటల పాటు, రెండవ రోజు నాలుగు గంటల పాటు ఆయుధాల కోసం అన్వేషణ చేశారు అధికారులు.. సాయంత్రానికి ఆయుధాలు బయట పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం జెసీబీ యంత్రాలతో వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తోంది. ఇక అటు ఇటీవల అరెస్ట్‌ అయిన సునీల్ యాదవ్‌ ..న్యాయవాదులతో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో బెయిల్ పీటీషన్ దాఖలు చేయాలని సునీల్ తరపు న్యాయవాదులు ఆలోచన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version