మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలుగురు కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు విచారణ చేశారు. అయితే… తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద హత్య కేసు లో సీబీఐ ఇవాళ 72 వ రోజు విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహం లో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
అయితే.. ఇవాళ్టి విచారణ లో భాగం గా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసు లో భాస్కర్ రెడ్డి కీలక అనుమానితుడి గా ఉన్నారు. ఈ నేపథ్యం లోనే ఇవాళ సీబీఐ అధికారులు ఆయనను విచారణ కు పిలిచారు. ఇక మరో వైపు కడప కేంద్ర కారాగారం లోని అతిథి గృహం లో సీబీఐ అధికారుల మరో బృందం చేపట్టిన విచారణకు జగదీశ్వర్ రెడ్డి మరియు భరత్ కుమార్ హాజరయ్యారు.