వైసీపీ ప్రభుత్వం పార్లమెంటులో రాష్ట్ర పరువు తీసింది – బోండా ఉమా

-

వైసిపి ప్రభుత్వం పార్లమెంటులో రాష్ట్ర పరువు తీసింది అన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా.టీడీపీ హయాంలో పోలవరానికి రూ.11 వేల కోట్లు ఖర్చుచేసి 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు.వైసీపీ ప్రభుత్వం మూడేళ్లల్లో ఎంత ఖర్చు పెట్టింది, నిర్వాసితులకు ఎంతిచ్చింది..? ఎంత శాతం పనులు పూర్తయ్యాయి? అంటూ ప్రశ్నించారు.పోలవరం పనులు జరుగుతున్న తీరు, పునరావాస చర్యలపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అంటూ నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వం పార్లమెంటులో రాష్ట్ర పరువు తీసిందన్నారు.వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణం అగమ్యగోచరంగా మారిందన్నారు ఉమా.పోలవరం పూర్తి కాకపోవడానికి ఎంపీ కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం రాష్ట్ర పరువు తీసేలా ఉందన్నారు.జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ఆగిపోయిందని అందరూ చెబుతున్నారని అన్నారు.పోలవరం నిర్వాసితులను వైసీపీ మోసం చేసిందన్నారు.

పోలవరం ముంపు గ్రామ వాసులకు 4 టమోటాలు, 4 ఉల్లిపాయలు,4 బంగాళా దుంపలిచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు.టీడీపీ హయాంలో పోలవరానికి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా అవార్డు వస్తే.. వైసీపీ హయాంలో జాతీయస్థాయిలో వరస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు వచ్చేలావుందన్నారు.టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం మంటగలిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలవరం నిర్మాణ పనులకు టీడీపీ ప్రభుత్వం 2016 డిసెంబరు 30న శంకుస్థాపన చేసి 70 శాతం పనులు నిర్విఘ్నంగా పూర్తి చేసిందన్నారు బోండా ఉమా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version