BREAKING : ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

-

ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ తరుణంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా చేపడుతున్నాయి వైసీపీ పార్టీ శ్రేణులు. ఇక ఇవాళ ఉదయం తొమ్మిదిన్నరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సజ్జల, పలువురు ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇక ఈ తరుణంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో “YSRCP 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన – ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..పార్టీ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంచిపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version