ఏపీలో వైసీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ ఢిల్లీలో ఉంటూ రఘురామ, వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇలా విమర్శలు చేస్తున్న రఘురామకు చెక్ పెట్టేయాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఆయనపై వేటు వేయించడానికి చూశారు..కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే తానే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి రాజు గారు రెడీ అయ్యారు.
అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు…రఘురామవి అన్నీ నాటకాలే అన్నట్లు మాట్లాడారు. దీనికి రఘురామ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. సీఎం చేతుల్లో రోజు తన్నుల తింటున్న ఆ వ్యక్తి కూడా తన రూట్‌లోనే వస్తున్నారని, త్వరలోనే వైసీపీ నుంచి గెంటేయడం గ్యారెంటీ అని మాట్లాడారు.అంటే విజయసాయిని వైసీపీ నుంచి బయటకు పంపే కార్యక్రమాలు జరుగుతున్నాయని రఘురామ పరోక్షంగా చెబుతున్నారు. అయితే ఈ మధ్య వైసీపీలో విజయసాయి హవా తగ్గిందని చెప్పొచ్చు. ఆయన ఎక్కువ కనబడటం లేదు. మరి దీనికి కారణం ఏంటో తెలియాలి.