అసెంబ్లీని రద్దు చేసే దమ్ము బాబుకి ఉందా?

-

బాబుకి వైసీపీ నేతల సవాల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కి అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ తరహాలో ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ వైసీపీ నాయకులు సవాల్ విసిరారు. అనైతికంగా ప్రతీ ఎన్నికల్లో అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ నాటి నుంచి నేటి వరకు ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా ఒంటరిగా ఏనాడు గెలవలేదని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. 99లో భాజపా, 2009లో మహాకూటమి, 2014లో భాజపా – జనసేన తో పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉంటే ప్రజలు ఓట్లేసి మళ్లీ తెదేపాను గెలిపిస్తారు కదా.. మరి చంద్రబాబుకి ఎన్నికలంటే ఎందుకు భయం అంటూ వారు విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version