రాజధానిపై వైసీపీ కొత్త ఎత్తు..శుభం కార్డు?

-

దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఏపీలోనే రాజధాని అంశంపై రచ్చ నడుస్తోంది. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి..చక్కగా కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకున్నాయి..అంతా బాగానే నడిచింది. కానీ ఏపీలో మాత్రం రాజకీయ పార్టీల రాజకీయంలో రాజధాని అంశం నలుగుతుంది.  రాష్ట్రం విడిపోయాక ఏపీకి రాజధాని లేని విషయం తెలిసిందే. దీంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన టి‌డి‌పి..రాష్ట్రానికి మధ్యలో ఉందని చెప్పి అమరావతిని రాజధానిగా నిర్ణయించింది.

అమరావతికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఒప్పుకుంది. కానీ ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు జగన్..మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారు. మూడు ప్రాంతాలు అభివ్ర్ద్ధి అవుతాయని అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, విశాఖని పరిపాలన రాజధానిగా చేస్తామని చెప్పారు. అభివృద్ధి చేయాలంటే ఎలాగైనా చేయవచ్చు. కానీ మూడు రాజధానుల వెనుక రాజకీయ కోణం ఉందని చెప్పవచ్చు.

సరే ఏదైనా గాని రాజధాని అంశంపై మూడున్నర సంవత్సరాలుగా రచ్చ నడుస్తోంది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని కోర్టులో కేసులు నడిచాయి…ఉద్యమాలు నడిచాయి. చివరికి ఆ కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. మరి కొన్ని రోజుల్లో తీర్పు రానుంది. కానీ ఈలోపు వైసీపీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు మూడు రాజధానులు అని చెబుతూ వచ్చిన వైసీపీ..ఇప్పుడు విశాఖ ఒకటే రాజధాని అని చెబుతుంది. ఆ మధ్య జగన్ గాని, ఇప్పుడు మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ రెడ్డి గాని..విశాఖ రాజధాని అని, ఏదో కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుందని, అమరావతిలో ఒక సెషన్ మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పారు.

అంటే విశాఖ ఒకటే రాజధాని అని తేల్చేశారు. ఇక దీనిపై సుప్రీం ఏ నిర్ణయం ఇస్తుందో చూడాలి. ఇక వైసీపీ విశాఖ రాజధాని ఎజెండాతో వెళితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version