కంచుకోటల్లో వైసీపీకి భారీ డ్యామేజ్..రికవర్ సాధ్యమేనా?

-

ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే.తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని, కాబట్టి ప్రజలు తమని అన్నీ స్థానాల్లో గెలిపిస్తారని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే 175 స్థానాల్లో గెలుస్తామనే కాన్ఫిడెన్స్ వేరు..అసలు మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చే పరిస్తితి వేరు. ఇప్పుడున్న పరిస్తితుల్లో 175 సీట్లు పక్కన పెడితే..కనీసం 100 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన గొప్పే అనే పరిస్తితి.

గత ఎన్నికల్లో అంటే టి‌డి‌పిపై వ్యతిరేకత, జనసేన ఓట్లు చీల్చడం, జగన్ ఇమేజ్ వల్ల వైసీపీ భారీగా గెలిచింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు. వైసీపీపై వ్యతిరేకత వస్తుంది..టి‌డి‌పి బలపడుతుంది…టి‌డి‌పి-జనసేన పొత్తులో వెళ్ళేలా ఉన్నాయి. అదే జరిగితే వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పదు. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వేలో కూడా అదే తేలింది. అసలు వైసీపీకి కంచుకోటల్లాంటి జిల్లాలోనే భారీ డ్యామేజ్ జరుగుతుంది.. గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది. అయితే వైసీపీకి కంచుకోట జిల్లాలు వచ్చి ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు అనే చెప్పాలి. అయితే సర్వేలో చిత్తూరు, కడపలోనే వైసీపీ కాస్త సత్తా చాటేలా ఉంది. మిగిలిన రెండు జిల్లాల్లో భారీ షాక్ తప్పదని తేలింది.

చిత్తూరులో 14 సీట్లు ఉంటే వైసీపీ 8, టి‌డి‌పి 4, టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉంటుందని తెలిసింది. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీ 6, టి‌డి‌పి 2 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉండగా రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉందని తేలింది. కర్నూలులో 14 సీట్లు ఉండగా టి‌డి‌పి 7, వైసీపీ 7 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. అటు నెల్లూరులో 10 ఉండగా టి‌డి‌పి 5, వైసీపీ 2, టఫ్ ఫైట్ 3 స్థానాల్లో ఉంది. గత ఎన్నికల్లో చిత్తూరులో మినహా మిగిలిన జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు పరిస్తితి రివర్స్ అయింది. మరి ఎన్నికల నాటికి ఈ జిల్లాల్లో వైసీపీ పుంజుకుంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version