కంచుకోటల్లో ఎదురుదెబ్బలు..వైసీపీకి రివర్స్ ఎందుకు?

-

వైసీపీకి కంచుకోటలు లాంటి జిల్లాలు చాలా ఉన్నాయి…ముఖ్యంగా రాయలసీమ అంటే వైసీపీ అడ్డానే. ఇక్కడ వైసీపీని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. ఇటు సీమకు ఆనుకుని ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా వైసీపీ హవా ఉంది. అంటే ఈ రెండు జిల్లాలు..ప్లస్ సీమలో ఉన్న చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైసీపీ హవా ఉన్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతుంది. 2014లో ఒక్క అనంతపురం మినహా మిగిలిన జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కొనసాగింది.

ఇక 2019 ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. మిగతా జిల్లాల్లో 90 శాతం సీట్లు వైసీపీనే గెల్చుకుంది. అలా ఈ ఆరు జిల్లాల్లో వైసీపీ హవా ఉంది. అలా వైసీపీ కంచుకోటలుగా ఉన్న ఈ స్థానాల్లో ఇప్పుడు సీన్ మారుతుంది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీనే గెలిచింది..కానీ ఆ స్థానాల్లో ఓట్లు తక్కువ. పైగా ప్రైవేట్ టీచర్లకు ఓటు హక్కు ఇవ్వడంతో ఎలాగోలా ఆ స్థానాల్లో వైసీపీ గెలిచింది.

కానీ ఒకో స్థానంలో రెండు లక్షలు పైనే ఉన్న పట్టభద్రుల స్థానాల్లో వైసీపీకి షాక్ తగిలింది. తూర్పు రాయలసీమ..అంటే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు స్థానంలో టి‌డి‌పి వన్ సడి గా గెలిచేసింది. దాదాపు 34 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పి అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు.

ఇక పశ్చిమ రాయలసీమ..కడప-కర్నూలు-అనంతపురం స్థానంలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఇప్పుడు అక్కడ రెండో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తున్నారు. అందులో టి‌డి‌పికి ఆధిక్యత వచ్చేలా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే అక్కడ కూడా వైసీపీకి షాక్ తప్పదు. ఏదేమైనా కంచుకోటల్లో వైసీపీ హవా తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version