చంద్రబాబు సర్కారు తరహాలోనే వైసీపీ సర్కారు కూడా ఇసుక విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇసుక తరలింపు విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. ప్రకాశం జిల్లా చినగంజాం ప్రాంతంలోని ఇసుక స్కామ్ లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడి పాత్ర ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ ప్రచారం మరీ ఎక్కువై ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని గ్రహించిన మంత్రి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు..ఇసుక అక్రమ తరలింపు విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
చిన్నగంజాంలో ఇసుక అక్రమ తరలింపు విషయంలో తన కుమారుడిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. గత ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లనే పీపీఏలపై కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఇసుక కొరతకు వైసీపీ నేతలు కారణాలుచెబుతున్నారు. దాదాపు 10 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు లేవు.
పెద్దగా వరదలు వచ్చిన దాఖలాలూ లేవు. అందువల్లే రాష్ర్టంలో అత్యధికంగా ఇసుకను అందించే నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదులకు వరదలు లేవు ప్రవాహం ఎక్కువగా లేని నదుల నుంచి ఇసుకను ఇష్టానుసారం బ్లాక్ లో అమ్ముకుంది గత టీడీపీ ప్రభుత్వం.. అని ఆరోపిస్తున్నారు.