టార్గెట్ 175: ఫ్యాన్స్ రానివ్వరు !

-

“ మనం కుప్పం స్థానిక ఎన్నికల్లో గెలిచాం…మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం…ఇంకా కుప్పం అసెంబ్లీలో సైతం గెలవగలం…అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని చెప్పి..ఆ మధ్య వైసీపీ వర్క్ షాపులో జగన్…ఎమ్మెల్యేలని అడిగిన విషయం విషయం తెలిసిందే. నెక్స్ట్ ఖచ్చితంగా 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు…ఇలా ఎప్పుడైతే 175 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారో అప్పటినుంచి వైసీపీ బలం తగ్గుతున్నట్లే కనిపిస్తుంది తప్ప…పెరుగుతున్నట్లు కనిపించడం లేదు.

సీఎంగా జగన్‌కు ప్రజల్లో ఆదరణ ఉంది…కానీ వైసీపీ ఎమ్మెల్యేలకే ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది..ఇదే జగన్ ఫిక్స్ చేసిన 175 టార్గెట్‌ని దూరం చేస్తుంది. అప్పటినుంచి 175 టార్గెట్ గా దూరంగా వైసీపీ నడుస్తోంది. చాలా స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ బలం పెరగడం వల్ల…పలు స్థానాల్లో టీడీపీ లీడ్ లోకి వచ్చింది. అయితే టీడీపీ…కొన్ని సీట్లలో వైసీపీని ఓడించగలదు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే…కొన్ని స్థానాల్లో వైసీపీని ఓడించేది వైసీపీ వాళ్లే.

అదేంటి సొంత పార్టీని ఎలా ఓడిస్తారని అనుకోవచ్చు…ఇక్కడే ట్విస్ట్ ఉంది….పలు స్థానాల్లో వైసీపీ నేతలు ఎవరికి వారు ఆధిపత్యం దక్కించుకోవాలని చెప్పి…వర్గ పోరుకు దిగుతున్నారు. దీని వల్ల చాలా నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగాయి. దీని వల్ల వైసీపీకి భారీగానే నష్టం జరిగేలా ఉంది. కొన్ని స్థానాల్లో సీట్ల కోసం పోటీ పెరిగింది. ఇలా పోటీ పెరగడం వల్ల…ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి ఉండదు…అలాగే వారిని ఓడించడానికి పనిచేస్తారు.

రాష్ట్రంలో దర్శి, కర్నూలు, తాడికొండ, నగరి, పార్వతీపురం, మార్కాపురం, గిద్దలూరు, విశాఖ, నెల్లూరు నగరం సీట్లలో వర్గ పోరు ఎక్కువగానే ఉంది…ఇవే కాదు ఇంకా చాలా సీట్లలో రచ్చ జరుగుతుంది…దీని వల్ల నెక్స్ట్ సొంత పార్టీని వైసీపీ నేతలే ఓడించేలా ఉన్నారు. ఈ సమస్యని గాని సరిచేయకపోతే వైసీపీకి ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version