వైకాపా యువనాయకులూ.. పంతాలకు పోతే “పేర్లు” మారతాయంతే!!

-

సాధారణంగా గోదావరిజిల్లాల్లో కుల ఫీలింగ్ లు పార్టీ ఫీలుంగులకంటే ఎక్కువగా ఉంటాయని టాక్! అయితే ఈ విషయంలో తూర్పుగోదావరి (తూగో) జిల్లాలో, అందునా కోనసీమ ప్రాంతంలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని మరీ టాక్! ఈ విషయంలో కాపులకు – బీసీలకు ఇది కాస్త తీవ్రంగా ఉంటుందని చరిత్ర చెబుతున్న మాట! ఇది మళ్లీ వైకాపాలో మొదలైందని మాట వినిపిస్తుంది!

మరీ గతానికి కాకుండా కాస్త రీసెంట్ విషయాలు చూసుకుంటే తూగో లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కి – కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులకు అప్పట్లో అస్సలు పడేది కాదని చర్చ జరిగేది! దానికి ప్రధాన కారణం కులం తాలూకు ఫీలింగ్స్ అని రాజకీయ సామాజిక వర్గాల్లో హాట్ డిస్కషన్స్ జరిగేవి! ఇదే క్రమంలో తాజాగా జక్కంపూడి రాజా – రాజమండ్రి ఎంపీ భరత్ ల మధ్య సాగుతుందని టాక్ వినిపిస్తుంది! అదే నిజమైతే మాత్రం… వారి రాజకీయ భవిష్యత్తుకు చాలా నష్టమే!

జక్కంపూడి రాజా రాజానగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటుండగా… బీసీ సామాజికవర్గానికి చెందిన భరత్ రాజమండ్రి ఎంపీగా ఎన్నికై ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అందరినీ కలుపుకుపోయే విషయంలో భరత్.. అనవరసర వివాదాలకు వెళ్లే విషయంలో రాజా లు ముందుకు సాగుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి!

యువకులు ఉత్సాహవంతులు అయిన వీరికి జగన్ పిలిచి టిక్కెట్లు ఇచ్చారు.. దగ్గరుండి గెలిపించుకున్నారు. ఇలాంటి సమయంలో వీరు పార్టీకి కేడర్ కు ప్లస్ అవ్వాలే తప్ప.. హెచ్చులకు పోయి, ఓవర్ యాక్షన్స్ చేస్తే అటు వీరి భవిష్యత్తుకు దెబ్బకొట్టుకున్నవారే కాకుండా.. పార్టీకి కూడా తలనొప్పులు తెచ్చినవారవుతారనే విషయం వీరు మరిచిపోకూడదు!

ఈ జనరేషన్ లో కూడా కులాలు పంతాలు వంటి పిచ్చి పనులకు పోయి.. సూపర్ గా ఉండబోయే రాజకీయ భవిష్యత్తును దెబ్బ కొట్టుకోవద్దని.. కలిసి మెలిసి ఉంటూ కార్యకర్తలకు, పార్టీకి మరింత బలంగా ఉంటూ ముందుకు సాగాలని “మనలోకం.కాం” కోరుకుంటుంది. అలా కాకుండా వ్యక్తిగత పంతాలకు పట్టింపులకు పోతే… పార్టీకి – జగన్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు..  వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల వైకాపా క్యాండిడేట్ల పేర్లు మారతాయంతే!

Read more RELATED
Recommended to you

Exit mobile version