ఆ ఆటగాడు సినిమా హీరో అవ్వగలడు : గంగూలీ

-

భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ కి ఎన్నో ఏళ్ల పాటు అద్భుతమైన సేవలందించాడు యువరాజ్ సింగ్. ఇక గతంలో అవకాశాలు లేక మనస్తాపం చెంది రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇటీవలే తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త అందించారు. కాగా ఇటీవలే యువరాజు గురించి బీసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేహ దుపియా ఇంటర్వ్యూ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేహా దూపియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు సౌరవ్ గంగూలీ. ఈ క్రమంలోనే భారత క్రికెట్ ఆటగాళ్ల లో ఎవరికీ హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ నేహా దూపియా ప్రశ్నించగా… యువరాజ్ సింగ్ కి హీరో అయ్యే అవకాశం ఉంది అంటూ సౌరవ్ గంగూలి చెప్పుకొచ్చాడు. ఇక సౌరవ్ గంగూలీ సమాధానం పై యువీ అభిమానులు మురిసిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version