ఇప్పటికే దేశాన్ని కరోనా రక్కసి పట్టిపీడిస్తున్న తరుణంలో ఇప్పుడు జికా వైరస్ కూడా ప్రజలపై విరుచుకుపడుతోంది. దేశంలో మరోసారి జికా వైరస్ కేసు వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు. జిల్లాలోని తలసరి గ్రామంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె చదువుకుంటోందని చెప్పారు ఆరోగ్యశాఖ అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆరోగ్యశాఖ అధికారులు.
రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా జికా వైరస్ కేసు గతేడాది జులైలో పుణెలో నమోదైందని పేర్కొన్నారు ఆరోగ్యశాఖ అధికారులు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఇప్పటికే ఫీవర్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ కూడా మరోసారి విజృంభించేందుకు కాచుకొని ఉంది. అయితే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు, సలహాలు జారీ చేశాయి.