చిన్నపాటి నష్టం వాటిల్లినా బాధ్యత కేసీఆర్‌దే : రేవంత్‌ రెడ్డి

-

గత ఐదు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలోని వివిధ ప్రాజెక్ట్‌లకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను విపత్తు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిందని తెలిపారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తక్షణమే సీఎం కేసీఆర్‌ సంబంధిత శాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు రేవంత్ రెడ్డి.

కడెం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 17 మంది మంత్రులను కేటాయించాలన్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు సాగు, తాగునీటి శాఖలు, వైద్య, విద్యుత్తు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఏ ప్రమాదం జరిగినా, చిన్నపాటి నష్టం వాటిల్లినా దానికి స్వయంగా సీఎం
కేసీఆరే బాధ్యత వహించాలన్నారు రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version