అమ్మవారికి ఎర్రవత్తులతో దీపారాధన చేస్తే ఈరాశివారికి ఉత్తమ ఫలితం! ఫిబ్రవరి 8 రాశి ఫలాలు

-

ఫిబ్రవరి 8 – శుక్రవారం రోజువారి రాశి ఫలాలు

8th february 2019 Friday horoscope
8th february 2019 Friday horoscope

మేషరాశి : మంచి ఫలితాలు. పట్టుదలతో కార్యాలు పూర్తిచేస్తారు, ధనలాభం, వాహన మార్పులకు సూచన. పరిహారాలు ఈశ్వర ఆరాధన లేదా అమ్మవారి కుంకుమ ధరించి పనులు ప్రారంభించండి.

వృషభరాశి : కార్యజయం, పనులు పూర్తి, లాభం, మనఃశాంతి, ఆనందం. ఇష్టదేవతారాధన చేసుకోండి. వీలైతే మాఘస్నానం చేయండి.

మిథునరాశి : అనుకూలమైన ఫలితాలు, కార్యజయం, ఆదాయం వృద్ధి, విందులు, వినోదాలు. పరిహారాలు దుర్గాదేవి స్తోత్రం పఠించండి లేదా వినండి.

కర్కాటకరాశి : ప్రతికూలమైన ఫలితాలు, ప్రయాణాలలో ఇబ్బందులు, స్త్రీమూలక ధనలాభం, పనుల్లో జాప్యం. పరిహారాలు అమ్మవారికి ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.

సింహరాశి : మిశ్రమ ఫలితాలు, అన్నింటా జయం, ధనవ్యయం, విందులు, వినోదాలు. పరిహారాలు అమ్మవారికి చండీదీపాన్ని పెట్టండి లేదా దేవాలయ ప్రదక్షణలు చేయండి.

కన్యారాశి : అనుకూలమైన ఫలితాలు, ప్రయాణలాభం, ధనం విషయంలో జాగ్రత్త. పరిహారాలు పసుపుపూలతో అమ్మవారికి పూజ లేదా ఆరావళి కుంకుమను ధరించండి.

తులారాశి : అన్నింటా జయం, కార్యాలు సఫలీకృతం, లాభం, పనులు పూర్తి. పరిహారాలు అమ్మవారి నామస్మరణ చేసుకోండి. ఓం దుర్గాయైనమః/ఓం బగలాయైనమః వంటి అమ్మవారి నామాలు శుచితో స్మరణచేసుకోండి.

వృశ్చికరాశి : ప్రతికూలమైన ఫలితాలు, ఆదాయానికి మించిన వ్యయం, పనుల్లో నెమ్మదితనం. పరిహారాలు అన్నదానం/గోసేవ చేయండి.

ధనస్సురాశి : మిశ్రమ ఫలితాలు, ధనవ్యయం, జయం, సుఖం, విందులు, వినోదాలు. పరిహారాలు గోసేవ లేదా అమ్మవారి కుంకుమ ధరించి పనులు చేసుకోండి.

మకరరాశి : ఆందోళన, ధనవ్యయం, భార్యతరపువారి సహకారం, వ్యసనాల వల్ల నష్టం. పరిహారాలు వేంకటేశ్వరస్వామి ధ్యానం లేదా దేవాలయ దర్శన చేయండి.

కుంభరాశి : మిశ్రమ ఫలితాలు, ధనవ్యయం, విరోధాలు, పనులు నెమ్మదిగా సాగుతాయి. పరిహారాలు అమ్మవారికి చండీదీపారాధన లేదా కుంకుమతో అర్చించండి.

మీనరాశి : మిశ్రమ ఫలితాలు, వస్త్రలాభం, అధికశ్రమ, పనుల్లో జాప్యం. పరిహారాలు చండీదీపారాధన లేదా గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది.

నోట్: దానాలు, ధర్మాలు, అన్నదానం అంటే ఏదో పెద్ద ఖర్చు అనుకోకండి. మీకు వీలైనంత, చాతనైనంత అంటే ఐదు రూపాయల నుంచి మీ శక్తిమేరకు ఇబ్బంది లేకుండా భగవంతునికి సేవ చేస్తున్నా అన్న భావనతో భక్తితో, శ్రద్ధతో చేయండి. దానం తీసుకోవడం అంటే మన అదృష్టంగ భావించండి, తీసుకునేవారిని విష్ణురూపంగా భావించి వారికి ఏదో ఒకటి ఇవ్వండి. తప్పక మీకు మంచి ఫలితం వస్తుంది. అది వెంటనే తెలియక పోవచ్చు. లేదా సూక్ష్మ ఫలితం రావచ్చు. కానీ తప్పక మంచి జరుగుతుంది. ఓం నమో వేంకటేశ్వరాయనమః

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version