డిసెంబర్‌ 12 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

కార్తీకమాసం- డిసెంబర్‌- 12- శనివారం.

మేషరాశి:ఉద్యోగాలలో కొత్త సమస్యలు !

ఈరోజు పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు. పనిపై ఎక్కువ దృష్టి ఉంచండి. ఎక్కువ సమయం గడపడం ద్వారా కుటుంబ సభ్యులకు మంచి అనుభూతి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. కొన్ని కారణాల వలన మిమ్మల్ని మీరు నియంత్రిం చుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న టెన్షన్లు ఇబ్బంది పెడతాయి. మీ సోమరితనాన్ని వదిలించుకోవాల్సి ఉంటుంది.

పరిహారాలుః శ్రీఉమామహేశ్వరస్వామికి అభిషేకం చేయండి.

todays horoscope

వృషభరాశి:మీకు చాలా బిజీగా గడుస్తుంది!

ఆర్థిక లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో శ్రద్ధగా ఉంటారు. తద్వారా నష్టాలను నివారించుకుంటారు.పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజంత మీకు చాలా బిజీగా గడుస్తుంది. సాయంత్ర సమయంలో మీకు శుభవార్త అందే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. మీకు కూడా వరుస లాభాలు చేకూరతాయి.

పరిహారాలుః శ్రీలలితా ఆరాధన చేయండి అనుకూలం ఫలితాలు పొందండి.

మిధునరాశి:ఈరోజంత ఉత్సాహంగా గడుస్తుంది!

ఈరోజు విద్యార్థులు చదువు పట్ల మరింత శ్రద్ద కనబరచాల్సి ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన వ్యవహారాలలో విజయం. శుభ వర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రయాణాలు సానుకూలం. ఈరోజంత ఉత్సాహంగా గడుస్తుంది. ఫోన్ లో బిజీగా ఉంటారు. వ్యాపార వేత్తలు వ్యాపారంలో నూతన పద్ధతులను అవలంబించే అవకాశం ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా, చివరకు పూర్తి చేస్తారు.

పరిహారాలుః శ్రీభ్రమరాంబికాష్టకం చదవండి. అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకరాశి:ఆలయాలు సందర్శిస్తారు !

పనుల్లో స్తబ్ధత. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతె ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకం. ఈరోజు ప్రత్యేకంగా గడుస్తుంది. ఎలాంటి ప్రమాదకరమైన పనులను ఈరోజు చేయకండి. కుటుంబంలోని ప్రత్యర్ధులు మీ వైపు ఎదురుగా మాట్లాడలేరు.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

సింహరాశి:శుభకార్యాలలో పాల్గొంటారు!

ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు మీకు మంచి జరుగుతుంది. మీ మనసులో ఏవైనా కొత్త ఆలోచనలు వస్తే, వాటిని వెంటనే అమలుపరచడానికి ఆలోచించండి చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. స్నేహితులతో జీవించడం వలన ప్రయోజనాలు చేకూరతాయి.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవి ఆరాధన వల్ల ఉపయోగం ఉంటుంది.

కన్యరాశి:ఈరోజు వ్యయప్రయాసలు !

ఈరోజు వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. ఈరోజు బిజీగా గడుపుతారు. దీర్ఘకాలం గా కొనసాగుతున్న ఉద్రిక్తత తగ్గుతుంది. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అయోమయస్థితి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. నిజాయితీగా పని చేయడం వలన మీకు లాభం చేకూరుతుంది.

పరిహారాలుః శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

తులరాశి:ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు !

ఈరోజు బిజీగా గడుస్తుంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఆస్తి, ధనలాభాలు. మిత్రులతో సఖ్యత. కొన్ని వివాదాలు సద్దుకుంటాయి. కార్యాలయం లో సహచరులు బృందంగా పని చేస్తారు.  ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. లావాదేవీల విషయంలో లాభం చేకూరుతుంది. ఆరోగ్యం విషయం పై దృష్టిని పెట్టండి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి సూక్త పారాయణం లేదా వినడం వల్ల కష్టాలు పోతాయి.

వృశ్చికరాశి:మీకు లాభం చేకూరుతుంది!

ఈరోజు పొద్దునపూట ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సాయంత్ర సమయంలో మీకు లాభం చేకూరుతుంది. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ప్రయాణ విషయాలలో మీరు ఎప్పుడు సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. పార్టీలోని కొంతమంది వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందు, వినోదాలు. బంధువర్గంతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని నిర్దిష్టపనులకు సంబంధించి మీ ఆందోళనలు కూడా అంతం అవుతాయి.

పరిహారాలుః శ్రీశివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

ధనుస్సురాశి:మీకు మంచి సమయం!

మీ కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. . వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు పూర్తి ప్రయోజనాలను పొందడానికి ఈరోజు మీకు మంచి సమయం ఆర్ధిక సంబంధమైన పనులలో అనుభవజ్ఞులైన వ్యక్తులను కలవడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన, నవగ్రహప్రదక్షణలు చేయండి.

మకరరాశి:ఈరోజు బంధువులతో తగాదాలు!

ఈరోజు మీ వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు రద్దు. బంధువులతో తగాదాలు. మీ పనిలో పరిస్థితులు మెరుగు పడతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అసంతృప్తి. ఎవరితోనూ ఇబ్బందులను కొని తెచ్చుకోకండి. వ్యాపారంలో లాభం వస్తుంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీరమణా ఆరాధన చేయండి.

కుంభరాశి:మంచి ఫలితాలు వస్తాయి!

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీ సహోద్యోగులతో కలసి ప్రాజెక్ట్‌ పని బాగా చేస్తారు. ఆఫీస్‌లో సహోద్యోగులతో కలిసి పని చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. మీ స్నేహితుడికి ఏదైనా బహుమతి కొనేటప్పుడు డబ్బు విషయంలో వెనకడుగు వేయకండి. చేపట్టిన పనులు, ఆటంకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. కొత్త పనులు చేపడతారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

పరిహారాలుః శ్రీదశరథ శనిస్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి:ఈరోజు సమావేశాలలో పాల్గొంటారు!

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఈరోజు సభలు, సమావేశాలలో మీరు పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు పోతాయి. ఆగిపోయిన పనులను మీరు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఈరోజు నెమ్మదిగా గడుస్తుంది. అనవసరం బయట తిరగకండి. ఇంటి సభ్యులతో ఎక్కువ సమయం  గడపండి.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version