సైరా తీసుకొచ్చిన పేరు నిలబెట్టుకునే పనిలో మిల్కీబ్యూటీ

-

తమన్నా అంటే గ్లామర్‌.. గ్లామర్‌ అంటే తమన్నా. నిన్నటివరకు ఇదే ఇమేజ్‌తో కెరీర్‌ గడిపేసిన మిల్కీబ్యూటీ… ప్రస్తుతం పెర్పార్మెన్స్‌ రోల్స్‌కే ఓటేస్తోంది. గ్లామర్‌గా కనిపించడానికి ఎలాంటి అడ్డంకి చెప్పదు. అయితే.. తను పోషించే పాత్ర మాత్రం.. నటిగా ఒక మెట్టు పెంచేదై వుండాలట. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఆమె పోషిస్తున్న రోల్స్‌ చూస్తుంటే.. మంచి నటి అన్న పేరు సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో వుంది తమన్నా.

డెబ్యూ మూవీ శ్రీ నుంచి…ఎఫ్‌2 వరకు అన్ని సినిమాలను అందంతో నింపేసింది తమన్నా. పెర్‌ఫార్మెన్స్‌పరంగా మాట్లాడుకోవాలంటే… 100 పర్సెంట్‌ లవ్‌… బాహుబలి.. సైరా వంటి కొన్ని సినిమాలే వున్నాయి. వీటి సంఖ్య పెంచుకోవాలన్న పట్టుదలతో వుంది మిల్కీబ్యూటీ.

సైరా నరసింహారెడ్డి తర్వాత తమన్నా ఆలోచనా విధానం మారింది. సైరాలో స్టార్స్‌ చాలామంది వున్నా.. యాక్టింగ్‌లో అందరికంటే ఎక్కువ మార్కులు తమన్నాకే పడ్డాయి. ఇలా వచ్చిన పేరు ఆమెను ఉబ్బితబ్బిబ్బు చేసింది. ఇప్పటివరకు గ్లామర్‌గా కనిపించింది చాలు. ఇక నుంచి పెర్‌ఫార్మెన్స్‌పై దృష్టిపెడదామన్న నిర్ణయానికి వచ్చేసింది. సంపత్‌నంది డైరెక్ట్‌ చేస్తున్న సీటీమార్‌లో మహిళా కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపించనుంది తమన్నా. ఇదే దర్శకుడు రవితేజాతో తీసిన బెంగాల్ టైగర్‌లో ‘చూపులతో దీపావళి..’ అంటూ.. ఒంపు సొంపులతో మెల్ట్‌ చేసిన తమన్నా.. సీటీమార్‌లో సీరియస్‌ రోల్‌ ప్లే చేస్తోంది.

మిల్కీ బ్యూటీ , సత్యదేవ్ జంటగా నటిస్తున్న చిత్రం ”గుర్తుందా శీతాకాలం”. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ ‘లవ్ మాక్ టైల్’ కు ఇది రీమేక్‌. ఇందులో తమన్నా క్యాన్సర్‌ పేషంట్‌గా నటిస్తోంది. ఈ రోల్ కావాలని మిల్కీ బ్యూటీ పట్టుబట్టి మరీ సాధించుకుందట. ఈ పాత్ర అయితేనే.. పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ వుంటుందన్నది తమన్నా ఆలోచన.

Read more RELATED
Recommended to you

Exit mobile version