డిసెంబర్‌ 18 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్ – 18 – శుక్రవారం – మార్గశిరమాసం.

 

మేషరాశి:ధన లాభం కలుగుతుంది !

ఈరోజు ధన లాభం కలుగుతుంది. అన్ని రంగాలలో శుభం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. పిల్లలు లేని వివాహం అయినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటుంది. ప్రతి కార్య సాధనలో విజయం సాధిస్తారు.

పరిహారాలుః శ్రీలలితా సహస్రనామ పారాయణ చేయండి. దీనివల్ల మీకు అనుకూల ఫలితాలు వస్తాయి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు విజయం సాధిస్తారు !

ఈ రాశివారు విద్యారంగంలో వైద్య రంగంలో విజయం సాధిస్తారు. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయకూడదు. ఎక్కువ శ్రమతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు మంచి మార్పులు పొందుతారు. చెడ్డవారితో స్నేహం చేయకూడదు. ఉద్యోగస్తులు పెద్ద వారితో గొడవలు పెట్టుకోరాదు. శ్రమాధిక్యత వల్ల విజయం సాధిస్తారు.

పరిహారాలుః భగవత్ ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. శివార్చన వల్ల మంచి లాభం పొందుతారు. తెల్లని వస్త్రాలు పాలు పెరుగు ఎవరికైనా దానం ఇస్తే మంచిది.

 

మిధున రాశి:ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే అవకాశం !

ఈ రాశి వారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై వారితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. మానసిక ప్రశాంతత దూరమవుతుంది. కోర్టు వివాదాల్లో ఆస్తి విషయాలలో నష్టం కలిగే అవకాశం ఉంది. మూడవ వ్యక్తి జోక్యం వల్ల మీరు ఇబ్బంది పడతారు. రైతులకు పంట నష్టం జరిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులు వాహనాలు చేజారిపోయే అవకాశం ఉంది. వివాహ నిశ్చయ ది కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది. అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి.

పరిహారాలుః శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

 

కర్కాటకరాశి:ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది !

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వ్యక్తుల మధ్య సఖ్యత లభిస్తుంది. అనుకోని నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు విద్యా రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. అనుకోని శుభవార్తలు వింటారు. అన్ని రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. క్రీడాకారులు విజయం సాధిస్తారు. కోర్టు వివాదాల్లో విజయం సాధిస్తారు.

పరిహారాలుః భగవత్ నామస్మరణ మీకు విజయాన్ని చేకూరుస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మీకు విజయాన్ని కలిగిస్తుంది.

 

సింహరాశి:మంచి వ్యక్తులతో పరిచయం !

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అన్ని రంగాలలో మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా రంగంలో మంచి ఫలితాలు పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యక్తులతో సంతోషంగా గడుపుతారు. ఆస్తి లాభం కలుగుతుంది. మిత్ర లాభము కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా అందులో విజయము సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణాలు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు.

పరిహారాలుః శ్రీ లక్ష్మీగణపతి ప్రార్ధన అనుకూల శుభ ఫలితాన్నిస్తుంది.

 

కన్యారాశి:విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు !

ఈ రాశి వారికి అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు వారి పనులలో మంచి ఫలితాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. శుభ కార్యక్రమాలు చేపడతారు. సువర్ణ ప్రాప్తి కలుగుతుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వర నామస్మరణ ఆనందాన్ని కలిగిస్తుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది.

 

తులారాశి:కోర్టు విషయాలు నెమ్మదిగా సాగుతాయి !

ఈరోజు వీరికి మధ్యస్తంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అతి కష్టం మీద విజయాన్ని సాధిస్తారు. అనుకోని వ్యక్తులతో వివాదాలు ఏర్పడతాయి. అతి కష్టంతో ఫలితాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబ వ్యక్తులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః శ్రీహనుమాన్ చాలీసా పారాయణం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

 

వృశ్చిక రాశి:అన్ని విషయాలలో అనుకూలత !

ఈరాశి వారికి అన్ని విషయాలలో అనుకూలత లభిస్తుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాన్ని సాధిస్తారు. విద్యార్థులు మంచి మార్కులు పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. అన్ని రంగాలలో విజయం సాధించి మంచి పేరు పొందుతారు. ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవి నామస్మరణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

 

 ధనస్సురాశి:ధనయోగం కలుగుతుంది !

ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ధనయోగం కలుగుతుంది. అదేవిధంగా వివాహం అయినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాన్ని సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి మీరు బయట పడతారు. భార్యభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలలో మీరు పాల్గొంటారు.

పరిహారాలుః శ్రీలక్ష్మీసూక్తంతో అమ్మవారికి పూజ చేయించండి.

 

మకర రాశి:ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం !

ఈ రాశి వారికి అన్ని రంగాలలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాలలో వారు మంచి లాభం గడిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. శుభవార్తలు వింటారు.

పరిహారాలుః శ్రీలక్ష్మీగణపతికి పాయసం నైవేద్యం సమర్పించండి. దీనిద్వారా మీకు మంచి జరుగుతుంది.

 

కుంభరాశి:అనుకోని వ్యక్తులతో తగాదాలు !

ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. అనుకోని వ్యక్తులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సొంత నిర్ణయాలతో వారి వారి పనులు చేసుకుంటే మంచి ఫలితాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. వాహనాల మీద జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన వ్యక్తులతో తగాదాలు పడకూడదు.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాన్ని చేకూరుస్తుంది.

 

 మీన రాశి:ఆకస్మిక ధన యోగం కలుగుతుంది !

ఈరోజు వీరికి అన్ని రంగాలలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. వ్యాపారస్తులు వారి రంగాలలో విజయం సాధిస్తారు. కుటుంబ వ్యక్తులు ఆనందంతో గడుపుతారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. విదేశీ ప్రయాణ వార్తలు వింటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. శుభ కార్యక్రమాలు చేపడతారు.

పరిహారాలుః శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version