ఆలియా,రణ్‌బీర్‌ పెళ్లి వాయిదాకి కారణం ఇదేనా ?

-

ఆలియా భట్‌ చిన్న మూమెంట్‌ని కూడా విడిచిపెట్టట్లేదు. షార్ట్ గ్యాప్‌ దొరికినా చాలు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి హాలిడే ట్రిప్పులేస్తోంది. రాజమౌళి చిన్న బ్రేక్ ఇవ్వగానే, రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి గోవా చెక్కేసింది. మరి ఇంత క్లోజ్‌గా మూవ్‌ అవుతోన్న ఆలియా భట్‌నైనా రణ్‌బీర్‌ పెళ్లి చేసుకుంటాడా.. అసలు వీళ్లిద్దరి పెళ్లి పోస్ట్‌పోన్స్‌ అవ్వడానికి కారణమేంటి అన్నదాని పై ఇప్పుడు బీ టౌన్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

రణ్‌బీర్‌ కపూర్‌కి బాలీవుడ్‌లో ప్లే బాయ్‌ ఇమేజ్‌ ఉంది. సినిమాకో మేకోవర్‌ మార్చినట్టు, గర్ల్‌ ఫ్రెండ్స్‌ని మారుస్తాడనే టాక్ ఉంది. దీపిక పదుకొణే, కత్రీన కైఫ్‌తో డీప్‌ లవ్‌ మెయింటైన్‌ చేసిన రణ్‌బీర్ తర్వాత వాళ్లిద్దరికీ బ్రేకప్ చెప్పాడు. నర్గీస్ ఫక్రీలాంటి హీరోయిన్లతోనూ డేట్‌ చేశాడు. టోటల్‌గా డజను వరకు హీరోయిన్లతో డేట్‌ చేసిన రణ్‌బీర్‌ ఇప్పుడు ఆలియా భట్‌తో రిలేషన్‌లో ఉన్నాడు.

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. రెండేళ్ల నుంచి వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకు పెళ్లి డేట్‌ మాత్రం కన్ఫర్మ్ కాలేదు. హాలిడే ట్రిప్పులు, ఫ్యామిలీ టూర్లు అని తిరుగుతున్నారు గానీ, పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు.

ఆలియా భట్‌ ఇప్పుడు కూడా హాలిడే టూర్‌లో ఉంది. ‘ట్రిపుల్ ఆర్’ షూటింగ్‌లో బ్రేక్‌ రాగానే లవర్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి గోవా వెళ్లిపోయింది. అయితే ఇప్పటికే వీళ్లిద్దరి పెళ్లి రెండు సార్లు వాయిదా పడింది. ఒకసారి రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్‌కి క్యాన్సర్‌ ఎటాక్ అయ్యిందని పెళ్లి వాయిదా పడింది. మరోసారి రిషి కపూర్‌ మరణంతో పెళ్లి వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version