మాసశివరాత్రి అభిషేకం చేయండి ఈ రాశి వారికి మంచి ఫలితం ఉంటుంది

-

(డిసెంబర్ 2 నుంచి 9 వరకు వార ఫలాలు)

మేశరాశి: ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని గ్రహాలు అననకూలత ఉన్నా వారం మధ్య నుంచి బాగుంటుంది. కుటుంబంలో సఖ్యత ఉండదు. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులు ఏకాగ్రతతో పనిచేయాలి. కొత్త పనులు వాయిదా వేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ప్రయాణసమయంలో దైవనామస్మరణ చేసుకోండి. ఈ వారం మాసశివరాత్రి అభిషేకం, ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం మంచి ఫలితం ఇస్తుంది.

వృషభరాశి: ఈ రాశివారికి అనుకూల సమయం. కుటంబంలో సఖ్యత ఉంటుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బాగుటుంది. బంధువులు సహాయసహకారాలు అందిస్తారు. వ్యవసాయదారులకు, వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. యాత్రలకు అవకాశం ఉంది. ఈ వారం శివాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

మిథునరాశి: ఈవారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషవాతావరణం ఉంటుంది. బంధువులు సహాయసహకారాలు అందిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. వ్యాపారులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మాట విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇష్టదేవతారాధన, దేవాలయ సందర్శన మంచి ఫలితాలను ఇస్తాయి.

కర్కాటకరాశి: ఈరాశివారికి అనుకూల సమయం. చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా అధిగమిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. విజయావకాశాలు ఉన్నాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడ్డా దైవబలంతో ముందుకుపోతారు. ఈవారం అన్నదానం, వస్త్రదానం చేయండి మంచి ఫలితం ఉంటుంది.

సింహరాశి: ఈ వారం అనుకూల ఫలితాలు లభిస్తాయి. గ్రహాల వ్యతిరేకత ఉన్నా దైవిక శక్తితో ముందుకుసాగుతారు. పట్టుదలతో పనిచేయండి విజయం సాధిస్తారు. వ్యాపారులకు, విద్యార్థులకు కష్టపడితే లాభం ఉంటుంది. వ్యవసాయదారులకు ఆశించినంత లాభం ఉండదు. ఉద్యోగస్తులకు శ్రమ ఉన్నా ఫలితం ఉంటుంది. ఈరాశి వారు మాసశివరాత్రి అభిషేకం, అమావాస్యనాడు దేవాలయ సందర్శన చేయండి మంచి జరుగుతుంది.

కన్యారాశి: ఈవారం శుభకరంగా ఉంటుంది. అన్ని అనుకూల ఫలితాలే. దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో భార్యా,పిల్లలతో సంతోషం. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఈరాశివారు ఇష్టదేవతారాధన, దానలతో మంచి ఫలితాలను పొందవచ్చు.

తులారాశి: ఈరాశివారికి అనుకూల వారం. విజయాలు వరిస్తాయి. కుటుంబంలో సంతోషం. బంధుమిత్రుల సహకారం. ఉద్యోగస్తులకు శుభసమయం. వ్యాపారులకు, విద్యార్థులకు శుభఫలితాలు గోచరిస్తున్నాయి. దీరఘకాలికంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి. ఈరాశివారికి దేవాలయ సందర్శన, దానాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

వృశ్చికరాశి: ఈరాశివారికి గ్రహాల అనుకూలత అంతగా లేదు. పనుల్లో జాడ్యం. ఆటంకాలు ఏర్పడుతాయి. కుటుంబంలో ప్రతికూల వాతావరణ. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వ్యాపారులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులు ప్రతిపనిని ఆలోచించి చేయాలి. ఈరాశివారు ఏ పనిచేసినా పెద్దలు, కుటుంబ సభ్యులతో చెప్పి సలహాలు తీసుకుని చేయాలి. విష్ణుసహస్రనామం, శివాభిషేకం మంచి చేస్తుంది.

ధనస్సురాశి: ఈవారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేసే పనులు పట్టుదలతో చేస్తే తప్ప పూర్తికావు. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు కొంత కష్టకాలమనే చెప్పాలి. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. బంధుమిత్రల సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఈవారం లక్ష్మీపూజ, నవగ్రహారాధన మంచి చేస్తాయి.

మకరరాశి: ఈరాశివారికి మంచి సమయం. గ్రహాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు, విద్యార్థులకు అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణాలు లభిస్తాయి. శనివారం దేవాలయ సందర్శన, నవగ్రహ ప్రదక్షిణ మంచి ఫలితాన్ని ఇస్తాయి.

కుంభరాశి: ఈరాశివారికి మంచికాలం. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం. కుటుంబంలో మంచి వాతావరణం. బంధుమిత్రుల సహకారం. వ్యాపారులకు, విద్యార్థులకు మంచిగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. స్థిర విజయాల కోసం నవగ్రహ ప్రదక్షిణలు, దేవీ పూజ, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

మీనరాశి: ఈవారం శుభ సమయం. గ్రహాలు అనుకూలం. కుటుంబంలో సంతోషం. బంధుమిత్రుల సహకారం. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు, విద్యార్థులకు శుభసమయం. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం. నోరుజారవద్దు. వాదాలకు దూరంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ఈవారం శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణం మంచి ఫలితం ఉంటుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version