తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. గొర్రెల కాపరి గమనించి ఎర్ర టవాలు కట్టడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు రైలును నిలిపివేశారు.
దీంతో విజయవాడ తిరుపతికి వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు ప్రమాదవశాత్తు విరిగిందా? లేక కుట్ర ఏమైనా దాగి ఉందా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు పట్టా విరిగిందా లేక కుట్ర ఏమైనా ఉందా కోణంలో విచారణ చేస్తున్నారు రైల్వే పోలీసులు. అటు ట్రాక్ కు మరమ్మతులు చేయిస్తున్నారు అధికారులు.